Home  »  TV News  »  తను చేసిన మోసం తెలుసుకున్న రాహుల్.. ఏం చేయనున్నాడు?

Updated : Mar 15, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-43 లో.. దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళంతా ఎవరి రూమ్ ఖాళీగా లేదని చెప్పడంతో.. అప్పుడు పని మనిషి శాంతతో కావ్య ఏదైనా ఉండడానికి చూపించు అని అంటుంది. ఇది స్టోర్ రూమ్ అమ్మా‌.. మీరు ఇందులో ఉండలేరని శాంత అంటుంది. ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి.. "మన ఇంటి కోడలు అందులో ఉండడం ఏంటి అక్కా" అని అపర్ణతో అంటుంది. నేను ఏమైనా ఉండమని చెప్పానా అని అపర్ణ అంటుంది. ఇక అక్కడే ఉన్న రేఖ.. తన స్థాయి తగ్గ గదినే ఎంచుకుంది. ఎంతైనా అక్కడ నుండి వచ్చిందే కదా అని అనడంతో.. ఆగు రేఖ అని కళ్యాణ్ తనని కోప్పడతాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసిన తప్పుకి, ఆ అమ్మాయి శిక్ష అనుభవిస్తుంది అని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కావ్య స్టోర్ రూమ్ ని నీట్ గా సర్దుకుంటుంది.

మరోవైపు నిజం తెలుసుకున్న రాహుల్.. ఇంతమోసం చేస్తావా స్వప్న అని అనుకుంటాడు. "ఏంటి రాహుల్ అలా చూస్తున్నావ్" అని స్వప్న అడగడంతో.. ఇంత అందం నాకేలా దక్కిందని అనుకుంటున్నా అని రాహుల్ కవర్ చేస్తాడు. కాసేపటికి నేను ఆఫీస్ పని మీద బయటికి వెళ్తున్నాను అని చెప్పి రాహుల్ బయటకి వెళ్ళిపోతాడు. మరో వైపు కావ్య ఎలా ఉందో తెలుసుకోవాలని.. రుద్రాణికి ఫోన్ చేస్తుంది కనకం. నీ కూతురిని మహారాణిలాగా చూసుకుంటున్నారని రుద్రాణి చెప్పడంతో కనకం సంతోషపడుతుంది.

మరోవైపు రాహుల్ బయటకు వెళ్తాడు. రాహుల్ ఇంకా రావట్లేదని ఆలోచిస్తూ స్వప్న అక్కడే ఉన్న పేపర్ చూస్తుంది. అందులో వచ్చిన రాజ్, కావ్యల పెళ్ళి మ్యాటర్ ని చూసి ఆశ్చర్యపోతుంది. కావ్య, రాజ్ ని పెళ్లి చేసుకుందా.. మా గురించి వాళ్ళకి తెలిసిపోయిందా? రాహుల్ కి నిజం తెలిసిందా అని అనుకుంటుంది. మరోవైపు రాజ్ ఫ్యామిలీ భోజనం చేస్తుంటారు. కావ్య భోజనానికి రాలేదేంటని కళ్యాణ్ అడుగగా.. తనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఈ ఇంట్లో  చాలా మందే ఉన్నారు.. ఎవరో ఒకరు దగ్గరుండి తీసుకొస్తారులే అని కళ్యాణ్ తో అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.